సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పందెం పుంజులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. రకాన్ని బట్టి ఒక్కో పుంజు ధర రూ. 5 వేల నుంచి రూ. 50 వేల వరకు పలుకుతోంది. పందెం రాయుళ్లు పుంజులకు బాదం, జీడిపప్పు వంటి పౌష్టికాహారంతో పాటు ప్రత్యేక వ్యాయామం చేయిస్తూ, బరిలో గెలుపే లక్ష్యంగా ముందస్తు తర్ఫీదునిస్తున్నారు.