ఉంగుటూరు పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే రోషన్ కుమార్ కలిశారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన రహదారుల నిర్మాణం, బస్ డిపో ఏర్పాటు, ఎత్తిపోతల పథకం, వంద పడకల ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాల, మినీ క్లస్టర్ పార్క్ ఏర్పాటు వంటి పలు అంశాలపై వినతి పత్రం సమర్పించారు. లింగపాలెం, చింతలపూడి మండలాలను ఏలూరు రెవిన్యూ డివిజన్‌లో కలపాలని కోరారు. ముఖ్యమంత్రి అన్ని అంశాలను పరిశీలించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.