ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలోని చేవూరుపాలెం సెంటర్లో శ్రీ సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలలో భాగంగా, మంగళవారం కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వామి ఉత్సవాలు చాలా వైభవోపేతంగా నిర్వహించటం ఆనందదాయకంగా ఉందని తెలిపారు.