ముదినేపల్లి గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా గురువారం విద్యార్థులకు పుస్తక పఠనం ప్రాముఖ్యతను వివరించారు. లైబ్రేరియన్ ఎం. శ్రీదేవి మాట్లాడుతూ, గ్రంథాలయాల్లో విజ్ఞానదాయకమైన పుస్తకాలతో పాటు నీతి కథలు, వినోదాన్ని పంచే రచనలు ఎన్నో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు.