మెంతా తుఫాన్: జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక అధికారి తాళ్లపూడిలో పర్యటన

476చూసినవారు
మెంతా తుఫాన్: జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక అధికారి తాళ్లపూడిలో పర్యటన
మెంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న కారణంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాళ్లపూడి మండలం లో పరిస్థితులను పరిశీలించడానికి డ్వామా శాఖకు చెందిన ప్రత్యేక అధికారి కె.రత్నకుమారి విచ్చేసారు. అధికార యంత్రాంగంతో చర్చించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గాలులు, వర్షం ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దని, అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయవచ్చని ఆమె సూచించారు.