అవినీతిని అంతం చేద్దాం: MLA బొలిశెట్టి

0చూసినవారు
సమాజంలో లంచం లేనిదే ఏ పని జరగని పరిస్థితి నెలకొందని MLA బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ వర్సిటీ క్యాంపస్‌లో బుధవారం రక్తదాన, మెడికల్ క్యాంప్‌లో ఆయన పాల్గొన్నారు. అవినీతిని నిలువరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చి మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్, అధ్యాపకులు హీరా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్