
నరసాపురం ఆర్యవైశ్య రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవములు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వై ఎన్ కాలేజీ రోడ్డు ఆర్యవైశ్య రామాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం 5వ రోజులో భాగంగా నిన్న రాత్రి స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పెద్దలు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








































