నరసాపురం ఉప కారాగారాన్ని ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి ఆర్. వరలక్ష్మి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని రికార్డులను పరిశీలించి, ఖైదీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు ఎదుర్కొంటున్న కేసుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి, అందుతున్న ఆహారం గురించి ఆమె ఆరా తీశారు.