పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గ్రామీణ మండలం సీతారామపురం సౌత్ లో తుఫాను కారణంగా నేలకొరిగిన భారీ వృక్షాల కలపను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ, కూటమి నాయకులు బుధవారం అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా కలపను తరలించడంపై వారు ప్రశ్నించారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.