కార్మిక నేత చింతకాయల బాబురావు మృతి ఉద్యమాలకు తీరని లోటు: సిఐటియు

7చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో ఇటీవల మృతి చెందిన కార్మిక సంఘ నాయకుడు చింతకాయల బాబురావుకు మొగల్తూరులోని సిపిఎం కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, బాబురావు అకాలమృతి ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. రైస్ మిల్ కార్మికుడిగా పనిచేస్తూ కార్మిక నేతగా ఎదిగిన వ్యక్తి బాబురావు అని, ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :