
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 18 మంది మృతి(వీడియో)
TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. చేవెళ్ల మం. మీర్జాగూడలో తాండూరు డిపో బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై కంకర ప్రయాణికులపై పడింది. దీంతో ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. జేసీబీ సాయంతో వారినిబయటకు తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.




