మొగల్తూరు పంచాయతీ కొండ వారి పాలెం లో విజయ్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన షటిల్ కోర్టును ఎస్సై జి వాసు గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్రీడలతో ఆరోగ్యం బాగుంటుందని, స్నేహబంధాలు పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జౌదుల విజయబాబు, ఆనంద్, స్టూడియో డేవిడ్, కొత్తపల్లి నవీన్, ఎస్ దేవదాస్ మాస్టర్, సొసైటీ డైరెక్టర్ మైలావత్తుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.