నరసాపురంలో జోరు వాన

1చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నరసాపురం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా మండలంలోని ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్