నర్సాపురం నియోజకవర్గ స్థాయి మాలల ఆత్మీయ సమ్మేళనం ఈనెల 29వ తేదీన సీతారాంపురం జెబీర క్యాంపస్ నందు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాల సోదరులంతా కుటుంబ సమేతంగా తరలిరావాలని మాలల న్యాయ పోరాట సమితి నాయకులు కోరారు. మంగళవారం మొగల్తూరు గ్రామంలో మాల నాయకులకు ఆహ్వాన పత్రికలు అందజేసి, గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మాలల ఐక్యతను చాటేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.