పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పేరుపాలెం నార్త్ లోని ముత్యాలమ్మ గుడి వద్ద శుక్రవారం, గ్రామానికి చెందిన సుమారు 100 మంది స్వాములు సామూహిక గణపతి హోమం నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ గురుస్వామి కటికల బాలాజీ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి. హోమం అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.