పేరుపాలెం నార్త్ లో సామూహిక గణపతి హోమం, అన్న సమారాధన

3చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం (ప.గో) పరిధిలోని మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ లోని ముత్యాలమ్మ గుడి వద్ద శుక్రవారం, సుమారు 100 మంది స్వాములు సామూహిక గణపతి హోమం నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని గురుస్వామి కటికల బాలాజీ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు, హోమం జరిగాయి. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది, ఇందులో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :