గురువారం నరసాపురం అంకానివారిపాలెంకు చెందిన పెదసింగు సీతపై ఆమె ఇంటి సమీపంలో కొక్కిలగడ్డ రాజు మరో ఏడుగురితో కలిసి దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఎస్సై సీహెచ్ జయలక్ష్మి తెలిపారు. బాధితురాలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.