నరసాపురం: రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు

3చూసినవారు
నరసాపురం: రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు
నరసాపురం మండలం రుస్తుంబాదకు చెందిన దువ్వాడ సత్యనారాయణ, కుటుంబంతో కలిసి వెండి ఆభరణాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 27న తన సైకిల్‌పై కొనుగోలుదారుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నరసాపురం ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్