నరసాపురం మండలం చిట్టవరం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన పూరిళ్ల రమేశ్ (45) మృతి చెందారు. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో రమేశ్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట పాలకొల్లు ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన తుదిశ్వాస విడిచారు.