నరసాపురంలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. పాతస్టేట్ బ్యాంక్ వీధిలో చెత్తను తొలగిస్తున్న మున్సిపల్ ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగబడింది. వ్యాపారాలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో జంగుసాహెబ్ వీధి నుంచి రఫీ కట్ పీసెస్ వీధిలోకి టర్న్ చేసే సమయంలో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడిన సమయంలో దుకాణాలు తీయకపోవడం, ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.