నరసాపురం శ్రీ మదన గోపాల స్వామి దేవస్థానం నూతన చైర్ పర్సన్‌గా వలవల సావిత్రి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈఓ డి. శ్రీనివాస్ రెడ్డి ఆమెతో పాటు పలువురు బోర్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సూచించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని పలువురు ప్రముఖులు అభినందించారు.