బుధవారం తెల్లవారుజామున నరసాపురం మండలం సీతారాంపురంలో రొయ్యల సీడ్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. కాకినాడ నుంచి మొగల్తూరు వెళ్తున్న ఈ వ్యాన్, సీతారాంపురం శివారులో రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టిందని గ్రామస్థులు తెలిపారు. ఈ దుర్ఘటనలో లక్షలాది రూపాయల విలువైన రొయ్యల పిల్లలు నేలపాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.