నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న 26 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో టౌన్ సీఐ బి. యాదగిరి చేతుల మీదుగా వీటిని బాధితులకు అందజేశారు. ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసుల సమర్థతను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్స్ పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు.