మొంథా తుఫాన్ కారణంగా నరసాపురం పట్టణంలోని పొన్నపల్లి, కొండాలమ్మ గుడి, వీవర్స్ కాలనీ ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని సోమవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో కలిసి కూటమి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను బాధితులకు పంపిణీ చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.