పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఇద్దరు యువకులపై పోక్సో కేసులు నమోదయ్యాయి. యలమంచిలి మండలానికి చెందిన తొమ్మిదో తరగతి బాలికలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పీఎం లంకకు చెందిన యువకులకు పరిచయం అయ్యారు. జనవరి 22న మొగల్తూరులోని లాడ్జికి తీసుకెళ్లి వారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో నరసాపురం CI దుర్గా ప్రసాద్ పర్యవేక్షణలో SI వై. నాగలక్ష్మి విచారణ చేపట్టారు.