
ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్‌పై ఉత్కంఠ
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. తెలంగాణ పోలీసుల అనుమతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దాంతో తెలంగాణ పోలీసులు అరెస్ట్‌కు అనుమతిస్తారా? లేదా అడ్డుకుంటారా? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అరెస్ట్ చేస్తే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నట్లు తెలుస్తోంది.




