పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం స్వరాజ్జరామం శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం అర్చకులు సాయి కార్తీక్ ఆధ్వర్యంలో భక్తులు పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకాలు నిర్వహించారు. అలంకరణ అనంతరం భక్తులు బాబావారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కస్తూరి శ్రీనివాస్, పెరుమాళ్ళ నాగరాజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకున్నారు.