పాముకాటుతో మృతి చెందిన వ్యక్తి

1226చూసినవారు
పాముకాటుతో మృతి చెందిన వ్యక్తి
మొగల్తూరు మండలం కాళీపట్నం ఈస్ట్ కు చెందిన బాలం కొండబాబు (45) అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతడిని నరసాపురం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కొండబాబు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మృతుని సోదరుడు బాలం రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్