నర్సాపురం మండలం కొత్త నర్సాపురం శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురిని రూరల్ ఎస్సై వెంకటేష్ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 9020 నగదు, 4 బైకులు, 5 సెల్ ఫోన్లు, 52 ప్యాక్ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై వెంకటేష్ హెచ్చరించారు.