మొగల్తూరు మండలం కేపీ పాలెం గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దేవుని తోట చెందిన మల్లుల దుర్గా ప్రసాద్ (26) అనే యువకుడు మృతి చెందాడు. బీచ్ కి వెళ్లి వస్తున్న దుర్గా ప్రసాద్, కుడిపూడి సాయి కృష్ణ, కవురు ప్రవీణ్ లు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కొబ్బరి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దుర్గా ప్రసాద్ కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.