కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం నరసాపురం గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి పోటెత్తారు. మహిళలు స్నానాలు చేసి, ఒడ్డున ప్రత్యేక పూజలు చేశారు. సకల పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుందనే నమ్మకంతో భక్తులు భక్తిశ్రద్ధలతో నదిలో కార్తిక దీపాలను వదిలారు. దీంతో నదీ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.