మొగల్తూరులో తండ్రీకొడుకులు పురుగుల మందు తాగి మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మోకా నాగమల్లేశ్వరరావు (70) మరియు ఆయన కుమారుడు వీర్రాజు (45) మధ్య సోమవారం చిన్నపాటి వివాదం తలెత్తింది. మనస్థాపన చెందిన కుమారుడు పురుగుల మందు తాగగా, అతన్ని వారించబోయిన తండ్రి కూడా అదే మందు సేవించాడు. కుటుంబ సభ్యులు వారిని నరసాపురం ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందిన గంట వ్యవధిలో కుమారుడు కూడా మృతి చెందాడు.