పేరుపాలెం బీచ్‌కి పర్యాటకుల ప్రవేశం నిలిపివేత

1979చూసినవారు
పేరుపాలెం బీచ్‌కి పర్యాటకుల ప్రవేశం నిలిపివేత
బంగాళాఖాతంలో ఏర్పడిన మంత తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కి పర్యాటకుల ప్రవేశాన్ని ఈ నెల 27వ తేదీ నుంచి ఈ నెల చివరి వరకు నిలిపివేస్తున్నట్లు మొగల్తూరు ఎస్సై జి వాసు తెలిపారు. కావున పర్యాటకులు ఎవరూ పేరుపాలెం బీచ్‌కు రావద్దని హెచ్చరిక జారీ చేశారు.