
హీరో విజయ్ పిలుపు.. వారి మాటలు నమ్మి మోసపోకండి
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్, పుదుచ్చేరి ప్రజలకు డీఎంకేను నమ్మవద్దని, ఆ పార్టీ నేతలు మోసం చేస్తారని పిలుపునిచ్చారు. ఉప్పళంరేవు మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తమిళనాడు, పుదుచ్చేరి పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తోందని, అయితే తాము అందరినీ తమిళులుగా చూస్తామని తెలిపారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పుదుచ్చేరిలో టీవీకే గెలుస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.




