పెంటపాడు మండలం మానవత సంస్థ నూతన కార్యవర్గం బుధవారం బోడపాడు గ్రామంలోని శ్రీవెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహనరావు అధ్యక్షత వహించారు. రాంబరికెల రాజు కుమార్ నూతన అధ్యక్షుడిగా, నల్లమిల్లి ప్రభాకరరెడ్డి కార్యదర్శిగా, ఏలూరి వీరాస్వామి కోశాధికారిగా, తారాడిపాల్ చైర్మన్‌గా, కృష్ణమోహన్ వైస్ చైర్మన్‌గా, వెంకటేశ్వరరావు కన్వీనర్‌గా, విప్పర్తి వినాయకుడు వైస్ ప్రెసిడెంట్‌గా సత్తారు రాము సంయుక్త కార్యదర్శిగా తేజనాథ్ (ఈసీ ఎడ్యుకేషన్) స్టాలిన్ బాబు (ఈసీ హెల్త్) కోటేశ్వరరావు (ఈసీ అవేర్నెస్జ యరాజు ఎమర్జెన్సీ ఎన్నికయ్యారు.