ఆగిరిపల్లి: హత్య కేసును చేదించిన పోలీసులు

0చూసినవారు
ఆగిరిపల్లి: హత్య కేసును చేదించిన పోలీసులు
ఏలూరు జిల్లా పోలీసులు ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెడ్డి సులోమన్ రాజు హత్య కేసును ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య రెడ్డి దుర్గామణి, పలగాని వెంకన్నబాబుతో కలిసి కుట్ర పన్ని, రూ. 12 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో కలతోటి సాయి శ్రీనివాస్, మద్దాలి జస్వంత్ రాయ్, కలతోటి మణికంఠ, పలగాని వెంకన్నబాబు మరియు రెడ్డి దుర్గామణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన బలెనో కారు, సెల్ ఫోన్లు, పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్ వైరు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్