ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలోని హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఈగల్ చీఫ్ శ్రీ ఏ. కే. రవికృష్ణ, ఐపీఎస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, కౌమార దశలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చదువు మరియు క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. విజయం సాధించాలంటే గట్టి పట్టుదల, బలమైన కోరిక అవసరమని సోక్రటీస్ కథతో వివరించారు.