
పాలకొల్లు: మంత్రితో శ్రీశైలం ఎమ్మెల్యే భేటీ
విజయవాడలోని రాష్ట్ర జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో బుధవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గంలోని జల వనరుల సమస్యలను ఆయన మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వాటి పరిష్కారం కోసం మంత్రిని కోరారు.






































