రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

9చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గండిపోశమ్మ ఆలయం వెళ్లి వస్తుండగా జరిగిన వ్యాన్ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. దొడ్డిపట్లకు చెందిన గెద్దాడ రాజేశ్‌ (35) రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. వ్యవసాయ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్న ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడు  ప్రమాదం జరిగిన రోజు మృతి చెందిన నరసింహస్వామి మిత్రులు.