నేషనల్ హైవే 216ను దిండి, పాలకొల్లుతో కలిపే చించినాడ బ్రిడ్జి బేరింగుల మరమ్మతుల కోసం ఆరు నెలలుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో నరసాపురం, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల నుంచి కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు వెళ్లే టెంపో, అంబులెన్సులకు కూడా ప్రవేశం లేకపోవడంతో చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.