పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

7చూసినవారు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామానికి చెందిన కరిణి ప్రవీణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లుగా శారీరక సంబంధం కొనసాగించి, ఇటీవల మరో యువతితో పెళ్లికి యత్నించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ప్రవీణ్ పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఈ నెల 15న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా, కోలుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Job Suitcase

Jobs near you