యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన 15 మంది ఆదివారం గండి పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా అంగులూరు ఘాట్ రోడ్డులో వారి వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో నరసింహారావు అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై కొద్దిసేపటికే మృతి చెందాడు. గాయపడిన మిగతా వారిని పోలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన యాత్రకు వెళ్లిన వారిలో విషాదం నింపింది.