పాలకొల్లు పట్టణంలో మద్యం మత్తులో ఉన్న ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక వడ్లవానిపేటకు చెందిన కె. వెంకటరత్నం (60) శుక్రవారం రాత్రి అతిగా మద్యం తాగి టాక్సీ స్టాండ్ వద్ద నిద్రించారు. శనివారం తెల్లవారుజామున కాలువలోకి తూలి పడిపోవడంతో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.