పాలకొల్లులో నేపాల్ దేశానికి చెందిన ఆన్ మిల్ఫీ శిల్ప బెహరాన్, పాలకొల్లుకు చెందిన నవీన్ కుమార్ ల వివాహం ఘనంగా జరిగింది. వీరిద్దరూ ఒకేచోట పనిచేస్తూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు హాజరుకాకపోయినా, అబ్బాయి బంధువులు, స్నేహితుల సమక్షంలో పాలకొల్లు కిరాణా మర్చంట్ భవనంలో భారతీయ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో వివాహం జరగడం సంతోషంగా ఉందని వధువు తెలిపారు.