మార్క్స్ 208వ జయంతి: తణుకులో సీపీఐ ఘన నివాళి

1426చూసినవారు
మార్క్స్ 208వ జయంతి: తణుకులో సీపీఐ ఘన నివాళి
కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు కారల్ మార్క్స్ 208వ జయంతి వేడుకలు మంగళవారం తణుకులోని సీపీఐ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ, మార్క్స్ ప్రపంచ గమనాన్ని మార్చిన మహామేధావి, శ్రామిక వర్గ పక్షపాతి అని కొనియాడారు. పెట్టుబడిదారీ విధానంలోని లోపాలను, దోపిడీని ఎత్తిచూపి, దోపిడీ లేని సమాజ నిర్మాణానికి మార్క్స్ ఊపిరి పోశారని, కార్మిక వర్గ విముక్తి కోసం ఆయన చూపిన మార్గం నేటికీ ఆచరణీయమని తెలిపారు.
Job Suitcase

Jobs near you