కలుపుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పాలకొల్లు మండలంలోని యాళ్లవానిగరువులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్. పైడి రాజు(55) యలమంచిలి మండలం అడవిపాలెంలోని రైస్ మిల్లులో కూలి పని చేస్తూ ఉంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసై రోజు కుటుంబీకులతో గొడవ పడుతుండేవాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వమని లేకపోతే చనిపోతా అంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో డిసెంబర్ 31న గడ్డిమందు తాగగా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.