పవిత్ర కార్తీకమాసం నాలుగో సోమవారం సందర్భంగా, పంచారామక్షేత్రం పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు చేసి, పంచామృతాభిషేకాలు, గోత్రనామార్చనలు, నిత్యాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీకమాసంలో చివరి సోమవారం కావడంతో, తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.