పాలకొల్లు పట్టణంలో మంగళవారం రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నాగరాజుపేట నుండి పాలమూరు వరకు ₹. 4.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ మాజీ విప్ అంగరతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ పనులు పట్టణ అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.