పాలకొల్లు: క్షీరారామంలో లక్ష దీపోత్సవం

1989చూసినవారు
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా, బుధవారం రాత్రి పాలకొల్లులోని పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానంలో లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు పాల్గొని, వివిధ ఆకృతులలో నేతి దీపాలను వెలిగించి స్వామివారికి అర్పించారు. ఈ దీపోత్సవాన్ని ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు.