
పాకిస్థాన్ నేవీలోకి కొత్త సబ్‌మెరైన్ (వీడియో)
పాకిస్థాన్ నౌకాదళం ఆధునీకరణలో భాగంగా, చైనాతో కలిసి సంయుక్తంగా నిర్మించిన హ్యాంగర్ క్లాస్ సబ్‌మెరైన్ గురువారం కరాచీ పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా రిసెప్షన్ సెర్మనీ నిర్వహించారు. 2015 ఒప్పందం ప్రకారం, మొత్తం 8 జలాంతర్గాములను పాకిస్థాన్‌కు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి నాలుగు చైనాలో నిర్మించగా, మిగిలినవి పాకిస్థాన్‌లోనే నిర్మించనున్నారు. ఈ ఆధునిక జలాంతర్గాములకు స్టీల్త్ సామర్థ్యం కూడా ఉంది.




